చంద్రబాబుకు బిగ్ షాక్
కేంద్రంలో విపక్షాలని ఏకం చేయాలని ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జి, మాయవతి చంద్రబాబుకు మొహం చాటేసినట్టు తెలుస్తోంది. ఫలితాల ముందే హడావుడి ఎందుకు ? ఫలితాలు వచ్చాక, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న విషయం తేలాక.. చర్చలు కొనసాగిద్దామని మాయవతి అన్నట్టు తెలిసింది. దీదీ ది అదే మాట. ఇప్పుడు కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా హ్యాండిచ్చారు. ఆయన ఇవాళ ఢిల్లీ టూర్ ని క్యాన్సిల్ చేసుకొన్నారు.
ఈవీఎంల అంశంపై చర్చించేందుకు విపక్షాలు ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్డీయేతర నేతలు ఈసీని కలవనున్నారు. వీవీప్యాట్ స్లిప్పులను మొత్తం లెక్కించాలని కోరనున్నారు. అవసరమైతే.. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగనున్నారు. ఐతే, ఈ సమావేశానికి దూరంగా ఉండాలని కర్ణాటక సీఎం కుమారస్వామి నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు అనుకూలంగా ఉండటంతో అందరు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.