బాలీవుడ్ ఎఫైర్స్’ని బయటపెట్టిన వివేక్.. !

బాలీవుడ్ లో ఎఫైర్స్ అన్నింటిని బయటపెట్టాడు వివేక్ ఒబెరాయ్. ఆదివారం 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడిన వెంటనే.. వివేక్ ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ ఫొటోలో ఐష్‌-సల్మాన్‌తో, వివేక్‌తో‌, అభిషేక్‌తో ఉన్నారు. అయితే సల్మాన్‌-ఐష్‌ ఉన్న ఫొటోపై ‘అభిప్రాయం’ అని, ఐష్‌-వివేక్‌ ఫొటోపై ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ అని, ఐష్‌-అభిషేక్‌ ఉన్న ఫొటోపై ‘ఫలితాలు’ అని రాసుంది. ఇది ఐష్ ఎఫైర్స్ గుర్తు చేసింది. దీనిపై తీవ్ర దుమారం రేగింది.


వివేక్‌ ఇంత నీచానికి దిగజారుతారని అనుకోలేదంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన మహిళా కమిషన్‌ వివేక్‌పై కేసు నమోదు చేసింది. మరోవైపు, వివేక్ ని ఆదర్శంగా తీసుకొని కొందరు నెటిజన్స్ బాలీవుడ్ లోని ఎఫైర్స్ అన్నింటిని బయటకు తీయడం మొదలెట్టారు. రేఖా, కరీనా కపూర్, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే.. ఎఫైర్స్ అన్నింటిని వివేక్ ఫార్మెట్ లోకి తీసుకొన్నారు. ఇప్పుడీ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.