వరల్డ్ కప్ కోసం ‘గోల్డ్ షూస్’ రెడీ

వరల్డ్ కప్ ఆడబోయే భారత ఆటగాళ్ల కోసం పూమ కంపెనీ స్పెషల్ షూస్ డిజైన్ చేసింది. అవి కెప్టెన్ విరాట్ కోహ్లీకి అందాయి. వాటిని మొదటిసారి ఓపెన్ చేసిన వీడియోని కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నా వరల్డ్ కప్ స్పైక్స్ వచ్చేశాయ్. గోల్డ్ & వైట్ కలర్ లో అద్భుతంగా ఉన్నాయి. ఇవి PUMA one8 Gold Spike Collector’s Edition. మా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వీటితో కలిసి చరిత్రని సృష్టించబోతున్నాం’ అంటూ ట్విట్ చేశారు కోహ్లీ. కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్లంతా ఈ షూస్ ని వేసుకోనున్నారు.