అనసూయ అక్కడ ఎంజాయ్ చేస్తోంది !


హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం హాలీడే ట్రిప్ లో ఉంది. ఫ్యామిలీతో కలిసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గుల్ మార్గ్ ప్రాంతంలో సేద తీరుతోంది. అక్కడ మంచు కొండలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోని అనసూయ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

అనసూయ వెండితెరపై కూడా రాణిస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగార్జునతో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘క్షణం’ మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక, రామ్ చరణ్ ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అదరగొట్టింది. మరోవైపు, ఐటమ్ సాంగ్ లని వదలడం లేదు. విన్నర్ చిత్రంలో ప్రత్యేకగీతంలో అదరగొట్టింది. ఇక జబర్థస్త్ షోలో అనసూయ ఎంట్రీ అందాలు ఎంతో ఫేమస్సో తెలిసిందే.