మరోసారి ప్రభాస్ పై ప్రేమ కురిపించింది.. !
ప్రభాస్-అనుష్క గాఢ ప్రేమికులు. కానీ, ఇప్పటి వరకు బయటపడలేదు. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అది బలపడింది. బాహుబలి 2 విడుదలైన వెంటనే ప్రభాస్-స్వీటీ పెళ్లిబంధంతో ఒక్కటవుతారనే ప్రచారం జరిగింది. ఐతే, ఆ ప్రచారంలో నిజం లేదు. తామిద్దరం స్నేహితులం మాత్రమేనని ప్రభాస్, స్వీటీ స్టేట్ మెంట్ ఇచ్చారు.
పైకి ప్రేమ లేదని చెబుతున్నా.. గుండెల్లోని ప్రేమని దాచుకోలేకపోతున్నారు. సాహో దుబాయ్ షెడ్యూల్ లో ప్రభాస్ గాయపడితే.. స్వీటీ విలవిలాడింది. వెంటనే దుబాయ్ వెళ్లి ప్రభాస్ ని పరామర్శించింది. రిస్క్ వద్దని ఒకటికి రెండు సార్లు చెప్పి వచ్చింది. ప్రభాస్ కూడా స్వీటీపై ఉన్న ప్రేమని సమయం వచ్చినప్పుడల్లా కురిపిస్తూనే ఉన్నాడు. స్వీటీ బర్త్ డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలిసింది.
మంగళవారం సాహో కొత్తపోస్టర్ విడుదలైన నేపథ్యంలో మరోసారి ప్రభాస్ పై ప్రేమని కురిపించింది స్వీటీ అనుష్క. సాహో కొత్త పోస్టర్ ని తన ఇన్ స్ట్రోగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అంశం.. ఆ తర్వాత ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు, బృందంలోని ప్రతి టెక్నీషియన్‌కు ఆల్ ది బెస్ట్. ఎగ్జైటెడ్’ అని కామెంట్ పెట్టింది.