మరో బాలీవుడ్ జంట విడాకులు


బాలీవుడ్ లో మరో జంట విడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. హీరో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య అవంతిక మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయబేధాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్-అవంతిక ప్రేమ వ్యవహారాన్ని బాలీవుడ్ లో గొప్పగా చెప్పుకునేవారు. ఏకంగా 8 ఏళ్లు ప్రేమించుకొన్న తర్వాత పెళ్లి చేసుకొన్నారు. 2014లో వీళ్లకు పాప కూడా పుట్టింది.

ఐతే, గత కొద్దికాలంగా వీరి మధ్య విబేధాలు తలెత్తాయి. ప్రస్తుతం ఇమ్రాన్-అవంతిక కలిసి ఉండడంలేదు. కొన్నిరోజుల కిందట తన ఐదేళ్ల కూతుర్ని తీసుకొని అవంతిక పుట్టింటికి వెళ్లిపోయింది. రీసెంట్ గా కుటుంబ సభ్యులందరితో కలిసి అమీర్ దిగిన ఫ్యామిలీ ఫొటోలో కూడా అవంతిక కనిపించలేదు. యంగా అమీర్ ఖాన్ రంగంలోకి దిగినప్పటికీ, మేనల్లుడి కాపురాన్ని చక్కదిద్దలేకపోయాడని తెలుస్తోంది