విపక్షాల డిమాండ్ ని తిరస్కరించిన ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం ముందు విపక్షాల మాట చెల్లలేదు. ఓట్ల లెక్కింపు సమయంలో తొలుత 5 వీవీప్యాట్లను లెక్కించాలంటూ విపక్షాలు చేసిన డిమాండ్‌ను ఈసీ తోసిపుచ్చింది. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని, వీవీప్యాట్లను మొదట లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది. ఓట్ల లెక్కింపు ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది.
వీవీప్యాట్లను లెక్కింపు విషయంలో విపక్షాలు చాన్నాళ్లుగా ఫైట్ చేస్తున్నాయి. 22 పార్టీలకి చెందిన నేతలు కలిసి కట్టుగా మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. లెక్కింపు సమయంలో వీవీప్యాట్లను తొలుత లెక్కించాలని, అందులో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా ఆ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు 11 పేజీల వినతిపత్రం అందజేశాయి. దీనిపై బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ.. తాజాగా విపక్షాల డిమాండ్ ని తోసిపుచ్చింది.