నా రాజీనామా లేఖ స్పీకర్ దగ్గరే ఉంది.
తన రాజీనామా లేఖ స్పీకర్ వద్దనే ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ లాబీలో సరదాగా మాట్లాడుతూ రేవంత్ ప్రస్తావన వచ్చినపుడు ఆయన ఇలా స్పందించారు. రేవంత్ గురించి స్పందించాల్సినవసరం లేదని, ఆయన రాజీనామా ఇప్పటివరకు స్పీకర్ కు రాలేదని అన్నారు. టీడీపీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనం అయ్యాక నా రాజీనామా లేఖ స్పీకర్ వద్ద ఉన్నా అది అప్రస్తుతమని చెప్పారు. రేవంత్ ఏదో ఆయన రాజీనామా స్పీకర్ కే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు అంతసీన్ లేదని, రాహుల్ గాంధీ వచ్చి రాష్ట్రంలో కూర్చున్నా చేసేదేమీ లేదని అన్నారు తలసాని. రేవంత్ చేరిక తరువాత కాంగ్రెస్ లోనే ఆటమొదలైందని ఎద్దేవా చేశారు. సంఖ్యాబలం లేనప్పుడు అవిశ్వాసం ఎందుకంటూ కాంగ్రెస్ నేతలను విమర్శించారు. తాము అసెంబ్లీలో ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని, యాభైరోజులు సభ జరుపుతామని చెప్పారు.