ఏపీలో వార్ వన్ సైడ్ !

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం వైకాపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బ్యాలెట్ లెక్కింపుల్లో వైకాపా స్పష్టమైన మెజారిటీని కనబర్చింది. తొలిరౌండ్ లోనూ ఆ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. ప్రస్తుతం 43స్థానాల్లో వైకాపా, 8స్థానాల్లో, జనసేన ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ట్రెండ్స్ ని గమనిస్తే.. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

ఏపీలో వైకాపాదే అధికారం అని జాతీయ సర్వేలు స్పష్టం చేశాయి. ఒక్క లగడపాటి సర్వే మాత్రం మరోసారి తెదేపా అధికారంలోకి రాబోతుందని తెలిపారు. ఐతే, మరోసారి లగడపాటి సర్వే తుస్సమంది. జాతీయ సర్వేల ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజా ట్రెండ్స్ తో వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా.. తెదేపా శ్రేణులు ఆందోళనలు ఉన్నారు.
ధిక్యంలో ఉంది.