మంగళగిరిలో లోకేష్ వెనకంజ


ఏపీ అసెంబ్లీ ఫలితాలు వన్ సైడ్ రాబోతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెడ్స్ ప్రకారం వైకాపా వందకు పైగా స్థానాల్లో విజయం సాధించేలా కనిపిస్తోంది. తొలిరౌండ్ ముగిసేసరికే వైకాపా 100స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మరోవైపు, ఏపీలో మంత్రులు వెనకంజలో ఉన్నారు. మంగళగిరిలో లోకేశ్ వెనకంజలో ఉన్నారు. మంత్రులు గంటాశ్రీనివాస్, సోమిరెడ్డి వెనకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెదేపా ఊహించని షాకులు తగులుతున్నాయని చెప్పవచ్చు.

ఇక తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కారుజోరు చూపిస్తోంది. ప్రస్తుతం 12 స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. సప్రైజ్ గా భాజాపా 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్ది ఆధిక్యంలో ఉన్నారు.