విజయంపై జగన్ స్పందన.. ఇది !

ఏపీలో వైకాపా ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆ పార్టీ 150స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైకాపా గెలుపు లాంచనమే. ఈ ఘన విజయంపై వైకాపా అధినేత వైఎస్ జగన్ స్పందించారు. “ఈ విజయం తాము ఊహించిందే. అఖండ విజయం సాధించిన మోడీకి శుభాకాంక్షలు. రాహుల్ గురించి ఇప్పుడేం మాట్లాడను. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిన పార్టీకే మా సపోర్టు ఉంటుంది” అన్నారు జగన్.

ఎల్లుండి (మే25) వైకాపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజు సీఎల్పీ నేతగా జగన్ ని ఎంచుకోనున్నారు. ఈ నెల30న ఏకాదశి రోజున ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, ఎంపీ స్థానాల్లో వైకాపా హవా కొనసాగుతోంది. 24 ఎంపీ స్థానాల్లో వైకాపా ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో తెదేపా అధిక్యం కనబరుస్తోంది.