రోజాపై ‘ఐరన్ లెగ్’ ట్యాగ్ తొలగిపోయిందోచ్.. !

రోజా ఐరన్ లెగ్. ఆమె ఏ పార్టీలోకి వెఌతే.. ఆ పార్టీ మటాష్ అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. ఇప్పుడీ ట్యాగ్ తొలగిపోయింది.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రోజా వరుసగా రెండోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తనని ఐరన్ లెగ్ అని పిలిచివారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై అలా పిలిస్తే.. తోలుస్తాను అన్నట్టుగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

‘నగరి అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తా. రాజన్న పాలనలో మాదిరిగా జగన్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారు. అనేక సంక్షేమ పథకాలతో అందరూ సుఖంగా ఉంటారని హామీ ఇస్తున్నా. ఐరన్‌లెగ్‌ .. రోజా గెలిస్తే జగన్‌ సీఎం కాలేరని విమర్శించిన వారందరికీ నా విజయం చెంపపెట్టు. నాది గోల్డెన్‌ లెగ్‌. నేను ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తా’నన్నారు రోజా. చివర్లో బై బై బాబు అంటూ.. తనదైన స్టయిల్ లో నవ్వులు పూయించారు.