రకుల్ కు వెరైటీ కుర్రోడు కావాలట !
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లోనూ ఖాతా తెరిచింది. ఆమె నటించిన దే దే ప్యార్ దే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 50కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఆనందంలో సినిమాకు మరింత పబ్లిసిటీ తీసుకొచ్చేందుకు రకుల్ ప్రతిరోజు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా పర్సనల్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెబుతోంది. ఇప్పటి వరకు తనకు ఎలాంటి ఎఫైర్లు లేవని, తనకి ఎవరు ప్రపోజ్ చేయలేదని చెప్పింది.
ఇక కాబోయే కుర్రాడు ఎలా ఉండాలనుకొంటున్నారు ? అంటే ఆయనలో మూడు కండీషన్స్ పెట్టింది. అవేంటంటే..? అతడు కనీసం 6 అడుగులు ఉండాలి. తను హై-హీల్స్ వేసుకున్నా కూడా తనకంటే హైట్ ఉండాలంటోంది. ఇక రెండో లక్షణం ఏంటంటే.. మనిషి నిజాయితీగా, సరదాగా ఉండాలట. మూడోది మరీ విచిత్రం.. రెగ్యులర్, రొటీన్ జాబ్ చేసే వ్యక్తి వద్దు. జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉంటూ, రొటీన్ జాబ్ ను ఇష్టపడని వ్యక్తి తనకు భర్తగా కావాలంటోంది. వెరైటీ కుర్రోళ్లు రకుల్ ని ట్రై చేసుకోండీ.. మరీ !