కాజల్ అన్నీ యాంగిల్స్ లో ట్రై చేసింది !

‘సీత’ హిట్టు బాధ్యత వందశాతం కాజల్ దే. సీత కథని నచ్చి మెచ్చి.. పట్టుబట్టి మరీ.. చేసింది. దర్శకుడు తేజ కూడా ‘సీత’ని దాదాపుగా లేడీ ఓరియెంటెడ్ సినిమా మలిచాడు. టీజర్, ట్రైలర్ లోనూ కాజల్ ని హైలైట్ చేశారు. కాజల్ రొమాంటిక్ గా కనిపించింది. గ్లామర్ షో చేసింది. యాక్షన్ లో దిగింది. కాలెత్తి మరీ తన్నింది. అది ట్రైలర్ లో హైలైట్ అయింది. సినిమా ప్రమోషన్స్ ని తనదైన శైలిలో చేసింది. మొత్తంగా సీత హిట్ కోసం అన్నీ యాంగిల్స్ లో ట్రై చేసింది. ఐతే, వాటికి ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారన్నది చూడాలి.

ఇది తేజ రామాయణం. ఇందులో సీత రొమాంటిక్. అగ్రెసివ్ గా ఉండబోతుంది. ఈ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా నటించారు. బాలీవుడ్ నటుడు సోనుసూద్ ప్రతినాయకుడిగా నటించారు. ఇక, సీత టైటిల్ పై బీజేవైఎం అభ్యంతరం వ్యక్తంచేసినా.. సినిమా సెన్సార్ పూర్తి కావడంతో చిత్రబృందం పెద్దగా భయపడటం లేదు. టైటిల్ మార్చం. ఏం చేస్తారో చేసుకోండని ఇప్పటికే తేజ తేల్చి చెప్పేశారు.