బెల్లకొండ పరువు తీసుకొన్నాడు
బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా ఇంకా విజయం అందుకోలేదు. మాస్-యాక్షన్ హీరోగా రాణించే టాలెంట్ శ్రీనివాస్ కు ఉందనే టాక్ ఉంది. కానీ, టాలెంట్ ని ఇంతవరకు రుజువుచేసుకోలేదు. ఈ నేపథ్యంలో తనశైలికి విభిన్నంగా ఉన్న పాత్రని ఒకటి ఎంచుకొన్నాడు బెల్లకొండ. అందరు వద్దన్న వినలేదు. అదే సీత. తేజ ‘సీత’. కాజల్ టైటిల్ పాత్రలో నటించింది. బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా, బాలీవుడ్ నటుడు సోనుసూద్ ప్రతినాయకుడుగా నటించారు. ఈ పాత్రని ఏ హీరో నచ్చలేదు. ఒక్క బెల్లకొండ తప్ప అని సినిమా ప్రమోషన్స్ లో తేజ చెప్పాడు. అది ఎందుకు అనేది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతోంది.
సీత ఇవాళ విడుదలైంది. బెల్లకొండ పాత్ర దరిద్రంగా ఉంది. అసలు ఆ పాత్రలో ఆయన సూట్ కాలేదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలాంటి పాత్రని బెల్లకొండ ఎలా ఓకే చేశారని కామెంట్ చేస్తున్నారు. సినిమా నెగటివ్ టాక్ పాయింట్స్ లోనూ బెల్లకొండ పేరు చెబుతున్నారు. ఆయన సినిమాని పెద్ద మైనస్ అంటున్నారు. శ్రీనివాస్ నాన్న బెల్లకొండ సురేష్ కూడా సీత కథ నచ్చలేదు. తండ్రి మాటని కాదని మరీ.. శ్రీనివాస్ సీత కథని ఓకే చేశాడు. ఇప్పుడు సినిమా చూసిన జనాలు ఆయన కేవలం కాజల్ కోసమే ఒప్పుకొన్నాడేమో అనే సటైర్స్ వేస్తున్నారు. ఎందుకంటే.. ? కాజల్ తో శ్రీనివాస్ కిది రెండో సినిమా. కవచంలో వీరిద్దరు తొలిసారి రొమాన్స్ చేశారు. ఆ సమయంలో ఏర్పడిన బంధంతోనే కాజల్ సినిమా కోసం బెల్లకొండ కమిట్ అయి ఉంటాడేమో.. !!