ఆ హీరోకు సాయి పల్లవి ప్రపోజ్ చేసింది

యంగ్ హీరోయిన్ సాయి పల్లవి నాచురల్ స్టార్ నానికి ప్రపోజ్ చేసింది. ‘ఓ గులాబి పువ్వు ఇచ్చి నువ్వు నాకు నచ్చావ్. ఎప్పుడు పెళ్లి చేసుకొద్దాం’ అంటూ ప్రపోజ్ చేసింది. ఇప్పుడీ లవ్ ప్రపోజల్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నానికి పెళ్లయిన విషయం ఈ ఫిదా పోరికి తెలియనట్టుంది. ఓస్.. ఇది రియల్ లవ్ లో కాదులెండీ. రీల్ లైఫ్ లో జరిగిన సంఘటన.

నాని – సాయి పల్లవి జంటగా శ్రీరామ్ దర్శకత్వంలో ‘మిడిల్ కాల్స్ అబ్బాయి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసింది. తాజాగా, ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. సాయిపల్లవి డైలాగ్స్ తో కూడిన సీన్స్ పై ఈ టీజర్ కట్ చేశారు. ఇందులో ఆమె నానికి ప్రపోజల్ చేసిన సీన్ అదిరిపోయింది. టైటిల్ కి తగ్గట్టుగానే మిడిల్ క్లాస్ అబ్బాయి చేసే కొన్ని పనులని టీజర్ లో చూపించేశాడు దర్శకుడు.

దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన నాని రెండో సినిమా ఇది. ఈ యేడాదియే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ‘నేను లోకల్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బ్యానర్ లో నాని ‘ఎంసిఎ’ చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.