టీడీపీకి కాబోయే బాస్ తారక్ !
ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ అని ప్రజలు తీర్పునిచ్చారు. వైకాపాని బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఆ పార్టీకి ఏకంగా 151స్థానాలని కట్టబెట్టారు. మా కొత్త సీఎం జగన్ అని గట్టిగా తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీకి కొత్త బాస్ ఎవరనే చర్చ కూడా మొదలైంది. ఆ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ వస్తోంది. మరీ.. ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరు ? అనేది ప్రశ్న. చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ పై పప్పు అనే ముద్రపడింది. ఆయన్ని పార్టీ నేతలు, ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. నందమూరి కుటుంబం వైపు చూస్తే బాలయ్య ఫర్ ఫెక్ట్ కాదు.
ఆయనకి కోపమొస్తే తట్టుకోలేరు. ఈ నేపథ్యంలో అందరి చూపులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైపు మళ్లాయి. ఎప్పుడు కాకపోయినా.. ఎప్పటికైనా టీడీపీ కాబోయే బాస్ తారక్ నే. ఆయనకి మాత్రమే టీడీపీని తిరిగి నిలబెట్టే దమ్ము, ధైర్ఘ్యం ఉందని చెబుతున్నారు. తారక్ కి కూడా లోపల సీఎం కావాలనే బలమైన కోరిక ఉంది. ఇటీవల బర్త్ డే సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ టీఆర్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. వాటిని తారక్ ఎంజాయ్ చేశారని అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఆశాకిరణం తారక్. ఆయన కాబోయే బాస్. కాబోయే ఏపీ సీఎం అంటున్నారు. మరీ.. ఏం జరుగుతుందో చూడాలి.