రివ్యూ : సీత


చిత్రం : సీత (2019)

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూసూద్, కోట శ్రీనివాసరావు తదితరులు

సంగీతం : అనూప్ రూబెన్స్

దర్శకత్వం : తేజ

నిర్మాణ బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్

విడుదల తేదీ : 24మే, 2019.

రేటింగ్ : 2.75/5

తేజ స్కూల్ నుంచి వచ్చిన కథాయిక కాజల్. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో కాజల్ ని హీరోయిన్ గా పరిచయం చేశాడు తేజ. ఆ తర్వాత కాజల్ టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోలతో ఆడిపాడింది. బాలీవుడ్ లోనూ మెరిసింది. ఐతే, ఇక కాజల్ పనైపోయింది అనే టైమ్ లో మరోసారి కాజల్ ని నిలబెట్టాడు తేజ. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత మరోసారి కాజల్ హవా మొదలైంది. తేజ టాలెంట్ గురించి బాగా తెలిసిన కాజల్.. ఆయన దగ్గర ఉన్న ఓ కథపై మనసుపారేసుకొంది. అదే ‘సీత’ కథ. పట్టుబట్టీ మరీ ఆ సినిమా చేసింది కాజల్. ఇంతకీ ఆ కథలో ప్రత్యేకతేంటీ ? కాజల్ నమ్మకాన్ని సీత కథ నిలబెట్టిందా ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

తేజ ముందే చెప్పినట్టు… సీత కథ.. ఈ తరం అమ్మాయి కథ. తన ఉన్నతి కోసం దేనికైనా తెగించే తత్వం కలిగిన అమ్మాయి సీత (కాజల్) కథ. ఆమెకు అనుకోని పరిస్థితుల వల్ల లోకల్ ఎమ్మెల్యే బసవ (సోనూసూద్)తో 5 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఆ డీల్ కారణంగా సమస్యలు ఎదురవుతాయి. వాటిని సీత ఎలా ఎదుర్కొంది ? అమాయకుడైన రఘురామ్ (బెల్లంకొండ శ్రీనివాస్)ను ఎందుకు ట్రాప్ చేసింది? ఫైనల్ గా సీత కోరిక నెరవేరిందా.. ?? అనేది బోల్డ్ డైలాగ్స్ మాస్ ఫ్లేవర్ తో కూడిన కథ.

ఎలా ఉందంటే ?

సీత విషయంలో కాజల్ టెంప్ట్ కావడంలో అర్థముంది. ఇది కథానాయికకి పేరు తీసుకొచ్చే కథ. సీత పాత్రని తేజ అద్భుతంగా తీర్చిదిద్దారు. దర్శకుడు ఫోకస్ మొత్తం సీత మీదనే కనబడింది. ఐతే, కథనం మీద పెద్దగా శ్రద్దగా చూపించినట్టు కనిపించలేదు. మిగితా పాత్రలని కూడా ఇంకాస్త బలంగా రాసుకొంటే ‘సీత’ ఫలితం మరో రేంజ్ లో ఉండేది. ఈ తరం అమ్మాయి కథన తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు. స్లో నేరేషన్ ప్రేక్షకుడిని బాగా ఇబ్బంది పెట్టింది. మొత్తంగా.. సీతగా కాజల్ సూపర్ హిట్. సినిమా ఎబో యావరేజ్ గా మిగిలిపోయేలా ఉంది.

ఎవరేలా చేశారంటే ?

సీతగా ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ అద్భుతంగా నటించింది. ఇందులో కాజల్ నే హీరోయిన్. వన్ ఉమెన్ షో చేసింది. కెరీర్ లోనే ది బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చింది. స్వీటీ అనుష్కకి అరుంధతి ఎలాగో.. కాజల్ కి సీత అలాగే. ఐతే, ఇదో డిఫరెంట్ జోనర్. సీత సినిమా నిలబడిందంటే.. అది కేవలం కాజల్ వలనే అని చెప్పాలి. ఇక, అమాయక చక్రవర్తి పాత్రలో బెల్లకొండ శ్రీనివాస్ పర్వాలేదనిపించాడు. మాస్ ఇమేజ్ కలిగిన బెల్లకొండ ఇలాంటి పాత్రని చేసేందుకు ఒప్పుకొన్నందుకు అభినందించాల్సిందే. ప్రతినాయకుడుగా సోనూ సూద్ అదరగొట్టాడు. ఆయన ఎక్స్ ప్రెషన్స్ లో అరుంధతి ఛాయలు కనిపించాయి.

సాంకేతికంగా :

అనూప్ రూబెన్స్ అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. నేపథ్య సంగీతం కథకు అనూగుణంగా ఉంది. సినిమాలో బోరింగ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని సీన్స్ కి కత్తెరపెట్టొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. బోల్డ్ డైలాగ్స్ అయినా.. టచ్ చేసేలా ఉన్నాయి. ఏకే ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్సీత (కాజల్) వన్ ఉమెన్ షో

రేటింగ్ : 2.75/5