‘రణరంగం’లో శర్వా.. అదిరిపోయింది !

సుధీర్ బాబు దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న సినిమాకు ‘రణరంగం’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు. ఇందులో శర్వా నెరిసిన గెడ్డెంతో చుట్టతాగుతూ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీ స్టయిల్ లో ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోలో శర్వా ఓల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. శర్వాతో పాటు ఇద్దరు ముందుకు నడుస్తుండా.. వెనక వందలాది మంది యుద్ధం వస్తున్నారు. వీరంతా రణరంగంలోకి దిగుతున్నట్టుగా వీడియోలో చూపించారు.

వీరి పోరాటం ఎవరిపైనా ? ఎందుకు ?? అనేది సినిమా చూడాల్సిందే. ఇందులో శర్వా గ్యాంస్ స్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ తో పాటు సినిమా రిలీజ్ డేటుని ప్రకటించింది చిత్రబృందం. ఆగస్టు2న సినిమాని విడుదల చేయనున్నారు.