‘బాబుకు రిటర్న్ గిఫ్ట్’.. ఇదేనేమో !


కాస్త ఆలస్యమైన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అందజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. డబుల్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఏపీలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడమే ఆయనకి కేసీఆర్ ఇచ్చిన పెద్ద రిట్నర్ గిఫ్ట్. ఎందుకంటే ? ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పై బాబు ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. జగన్ కేసీఆర్ సామంత రాజు. జగన్ గెలిస్తే.. ఏపీ కేసీఆర్ చేతిలోకి వెళ్తుందని విమర్శించారు. ఐతే, బాబు ఎంత రెచ్చగొట్టిన కేసీఆర్ మౌనం వహించారు. కౌంటర్ ఇస్తే అది బాబుకు ప్లస్ అవుతుందని వ్యూహాత్మక మౌనం వహించారు. ఆ ఎత్తుగడ ఫలించింది. జగన్ కేసీఆర్ మనిషి అని తెలిసినా ఆయన్ని ఏపీ ప్రజలు గెలిపించారు.

ఇదే చంద్రబాబుకు కేసీఆర్ అందజేసిన అసలైన రిటర్న్ గిఫ్ట్. ఇక, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి జగన్ శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని కలిశాయి. ఈ సందర్భంగా జగన్ ని కేసీఆర్ ఆలింగనం చేసుకొన్నారు. మిఠాయి తినిఒపించారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చకొన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల ముందుకు వెళదామని ఓ మాట అనుకొన్నారు. గోదావరి నది నుంచి ఏటా 3,500 టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుంది.

ప్రకాశం బ్యారేజీ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వవచ్చు అని కేసీఆర్ సూచించారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులూ నిర్ణయించారు. ఇన్నాళ్లు తెలంగాణపై విషం చిమ్మిన బాబుకు ఇది చెంపదెబ్బ. రాజకీయాల్లో ట్రెండు మారిందని కేసీఆర్, జగన్ నిరూపించారు. ఇది బాబుకు కేసీఆర్ ఇచ్చిన రెండో రిటర్న్ గిఫ్. మొత్తంగా కాస్త ఆలస్యమైన చంద్రాబుకు ఒకటి కాదు రెండు రిటర్న్ గిఫ్టులు అందజేసారు కేసీఆర్.