ప్రపంచకప్‌లో టీమిండియా తొలి ఓటమి


ప్రపంచకప్ ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌మ్యాచ్‌లో టీమిండియా
ఓటమిపాలైంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కోహ్లీ సేన 39.2 ఓవర్లలో భారత్‌ 179 పరుగులు చేసి ఆలౌటైంది. రవీంద్ర జడేజా (54; 50 బంతుల్లో 6×4, 2×6), హార్దిక్‌ పాండ్య (30; 37 బంతుల్లో 6×4) చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. 180 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 37.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కేన్‌ విలియమ్సన్‌ (67; 87 బంతుల్లో 6×4, 1×6), రాస్‌టేలర్‌ (70; 73 బంతుల్లో 8×4) బాధ్యతాయుతంగా ఆడి అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించి జట్టుని విజయబాటలో నడిపించారు. అనంతరం విలియమ్సన్‌ ఔటైనా అప్పటికే ఆ జట్టు విజయం ఖాయమైంది. ఆఖర్లో టేలర్‌, హెన్రీ నికోల్స్‌ (15; 28 బంతుల్లో 1×4) నిలకడగా ఆడి లక్ష్యాన్ని పూర్తిచేశారు.