ఆ నిందితుడిని కాపాడింది జగన్ నే.. !


జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ శనివారం విడుదలయ్యారు. ఏడు నెలల రిమాండ్‌ తర్వాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చాడు. మీడియాతో మాట్లాడాడు. ప్రజా సమస్యలను కొన్నింటిని పేపర్‌పై రాసుకొని వాటిని వివరించేందుకు జగన్‌ వద్దకు వెళ్లా. ఆ కంగారులో జగన్‌కు కత్తి తగిలింది. కానీ, తాను జగన్ చంపాలనుకోలేదని చెప్పుకొచ్చాడు.

“నేను కావాలని దాడి చేయలేదు. అది అనుకోకుండా జరిగింది. జగన్‌కు నేను అభిమానిని. తప్పు చేశానని నిరూపిస్తే శిరచ్ఛేదం చేసుకుంటా. దాడి జరిగిన అనంతరం నన్ను అక్కడ ఉన్న వారు కొడుతుంటే జగనే ఆపారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు ఆయనే కారణం. ప్రజలు కోరుకున్న విధంగా జగన్‌ సీఎం కావడం సంతోషంగా ఉంది” అన్నారు నిందితుడు శ్రీనివాస్‌.