కేంద్ర మంత్రి పదవిపై బండి సంజయ్ మాట
తెలంగాణలో భాజాపా అనూహ్యంగా పుంజుకొంది. ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలని గెలుచుకొంది. నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, సింద్రాబాద్ లోక్ సభ స్థానాలను కమలం పార్టీ సొంతం చేసుకొంది. కేంద్రంలోని మరోసారి ఎన్టీఆర్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినేట్ లో ఒకరి ప్రాతినిధ్యం తక్కనుంది. ఆ అవకాశం కిషన్ రెడ్డి, బండి సంజయ్ లో ఒకరికి దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు.
“తనకు కేంద్ర మంత్రి పదవి కావాలన్న అత్యాశ లేదు. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారంలో నిజం లేదన్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఇప్పుడు పూర్తిస్థాయిలో అభివృద్ధిపైనే దృష్టి సారిస్తా. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటా. దీంతోపాటు జిల్లాలో భాజపా విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తా.
రెండు పర్యాయాలు కార్పొరేటర్, మరో రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్‌తో పాటు ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా. తనని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు’ అన్నారు సంజయ్.