బోయపాటి సినిమాకు నిర్మాత కరువు
టాలీవుడ్ టాప్ దర్శకుల్లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఒకరు. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమానైనా చేయాలని స్టార్ హీరోలు సైతం ఆశపడేవారు. ఐతే, ఇదంతా ‘వినయ విధేయ రామ’ సినిమాకు ముందు. ఇప్పుడు సీన్ మారింది. బోయపాటి హీరోలే కరువుయ్యారు. నిర్మాతలు దొరకడం లేదు. ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అయింది అని కాదు. కానీ, ఆ తర్వాత బోయపాటి తీరు పట్ల రామ్ చరణ్ తీవ్ర అసంతృప్తి చేసినట్టు వార్తలొచ్చాయ్. ఏపీలో టీడీపీ ఘోర పరాజయం ఎఫెక్ట్ కూడా బోయపాటిపై పడింది.
టీడీపీ కోసం బోయపాటి చేసిన ఎన్నికల ప్రచార వీడియోలు సూపర్ హిట్. కానీ ఎన్నికల్లో పార్టీ మాత్రం ఫ్లాప్. బోయపాటి ప్రకటనల్లో బిల్డప్ ఎక్కువయ్యాయనే టాక్ కూడా ఉంది. ఇక, సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బోయపాటితో చేసేందుకు స్టార్ హీరోలు ఎవ్వరు ఖాళీగా లేరు. బోయపాటి తయారు చేసిన స్క్రిప్ట్ కు బాలయ్య ఓకె అన్నారు. కానీ నిర్మాత దొరకడం లేదు. ఎందుకంటే ?
బోయపాటి 60 కోట్ల ప్యాకేజ్ చెబుతున్నారు. బాలయ్య మీద 60 అంటే రిస్క్ అని నిర్మాతలు భావిస్తున్నారు. 50లోపు అయితే కొందరు నిర్మాతలు ముందుకొచ్చేలా ఉన్నారు. ఫైనల్ గా బోయపాటి తగ్గక తప్పదని ఇండస్ట్రీ టాక్.