బెజవాడలో వర్మ గాండ్రింపులు
అవమానం జరిగిన చోటే సన్మానం చేయించుకోవడం గొప్ప విషయం. ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అదే చేస్తున్నారు. ఇటీవల విజయవాడలో వర్మ ప్రెస్ మీట్ నిర్వహించేందుకు విఫల యత్నం చేశారు. ఎన్నికల కోడ్ అమలు ఉన్నందన్న నెపంతో తెదేపా ప్రభుత్వం వర్మ ప్రెస్ మీట్ కు అనుమతిని ఇవ్వలేదు. బెజవాడలో అడుగుపెట్టగానే వర్మని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లింది. కొన్ని గంటల తర్వాత తిరిగి హైదరాబాద్ విమానం ఎక్కించేసింది.
దీన్ని వర్మ అవమానంగా ఫీలయ్యారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అన్నదే లేదని విమర్శించారు. ఐతే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏపీలో తెదేపా ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న ఏపీలో విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ ని చాలా స్వేచ్చగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వర్మ ఇవాళ బెజవాడ, తిరుపతిలలో ప్రెస్ మీట్ ని నిర్వహించబోతున్నారు. మొత్తానికి.. వర్మ తన పంతం నెగ్గించుకొంటున్నారు. ఇక ప్రెస్ మీట్ లో తెదేపా నేతలపై వర్మ సటైర్స్ వేయడం ఖాయంగా కనిపిస్తోంది.