తిరుమల శ్రీనివారిని దర్శించుకున్న జగన్
కాబోయే ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి వైకుంఠం ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకొన్నారు. స్వామివారి సన్నిధికి చేరుకున్న జగన్ కొన్ని నిమిషాల పాటు మూలమూర్తిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపానికి చేరుకున్న జగన్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటాలను బహూకరించారు.
జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలువురు ఎంపీలు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ముఖ్యమంత్రులు, గవర్నర్ మహా ద్వారం గుండా వెళ్లి తిరుమ శ్రీవారిని దర్శించుకోవచ్చు. కానీ, కుంఠం ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకొన్నారు. బహుశా.. ఇంకా సీఎం ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి.. ఆయన మహా ద్వారం గుండా వెళ్లలేదని తెలుస్తోంది. తిరుపతి నుంచి జగన్ కడప ఇడుపుల పాయకు వెళ్లనున్నారు. తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఇక, రేపు మధ్యాహ్నం 12:23నిమిషాలకి జగన్ ఏపె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.