జగన్’తోనే ‘యాత్ర’కు ముగింపు !
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. వైఎస్సార్ చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం నేపథ్యంలో ‘యాత్ర2’పై ప్రకటన చేశారు దర్శకుడు రాఘవ. జగన్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సీక్వెల్ ని తీసుకొస్తానని ఇటీవలే తెలిపారు. తాజాగా ఈ సినిమా గురించి రాఘవ్ ట్విటర్ వేదికగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లేకుండా తన ‘యాత్ర 2’ సినిమా పూర్తికాదన్నారు.
“వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్ లేకుండా వైఎస్సార్ కథకు ముగింపు ఉండదు. ‘యాత్ర 2’ ద్వారా వీరి ముగ్గురి కథ గురించి చెప్పి సినిమాకు ముగింపు చెప్తాను. ‘యాత్ర’ సినిమాను జగన్ ప్రస్తావనతోనే ముగించేశాం. రెండో భాగంలో జగన్ ప్రయాణం గురించి చూపించాలనుకుని అలా చేశాం. వైఎస్సార్ యాత్ర ఆయన తండ్రి రాజా రెడ్డి సమాధి నుంచి మొదలైంది. జగన్ యాత్ర తన తండ్రి సమాధి నుంచి ప్రారంభమైంది” అని రాసుకొచ్చారు రాఘవ్.
YSR’S story is incomplete without Y.S. Raja reddy & Y.S.Jagan. Yatra 2 will complete their story. The reason why Yatra ended on Y.S. Jagan is we could take it off from where we left. YSR’s Yatra started from his father grave and Jagan’s Yatra from his father’s #yatra2 @ShivaMeka
— Mahi Vraghav (@MahiVraghav) May 29, 2019