‘మల్లేశం’ ట్రైలర్ రివ్యూ

తెలంగాణ నేత కార్మికుడు మల్లేశం జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మల్లేశం’. రాజ్ ఆర్ దర్శకుడు. కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. ఆరవ తరగతి వరకు చదివిన మల్లేశం ఎన్ని అడ్డంకులు అధిగమించి, మరమగ్గంపై అద్భుతాలు సృష్టించి, అవార్డులు అందుకున్నాడు అన్నది కథ. జూన్ 21 మల్లేశం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. మల్లేశం పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. తెలంగాణ యాస, భాష, సంసృతి ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కథని దర్శకుడు ఎమోషనల్ గా డీల్ చేసినట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది. కమర్షియల్ హంగులని దట్టించారు. ఈ సినిమా అవార్డులతో, కలెక్షన్స్ కురిపించేలా కనిపిస్తోంది.