దర్శకేంద్రుడి హీరో నాగశౌర్య !

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ విభిన్నమైన సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రకటన చేశారు దర్శకేంద్రుడు. ముగ్గురు హీరోయిన్లు..ముగ్గురు డైరక్టర్లు.. ఓ హీరోతో సినిమా ఉండనుంది. ఈ మేరకు కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా వదిలారు. ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ముగ్గురు దర్శకుల్లో ఒకరు క్రిష్. మూడు కథలు, ముగ్గురు హీరోయిన్లు వుంటారు. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు డైరక్ట్ చేస్తారు. మూడింటికి నాగశౌర్యనే హీరో. మిగిలిన ఇద్దరు దర్శకులు ఎవరు ? ముగ్గురు హీరోయిన్స్ ఎవరు ?? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని బాహుబలి నిర్మాతలు నిర్మించనున్నారు.