అప్పుడు.. ఇప్పుడు !


ప్రపంచకప్-2019 తొలి మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ చక్కటి ఫోటోలని ఒకటి షేర్ చేశారు. #Togetheragain అంటూ అప్పట్లో సచిన్, గంగూలీతో కలిసి మైదానంలో దిగిన ఫోటోని.. ప్రస్తుతం వ్యాఖ్యతగా వీరు ముగ్గురు మైకులు పట్టుకొన్న ఫోటోలని షేర్ చేశారు. ఈ రెండు ఫోటోలు కూడా క్రికెట్ ప్రేమికులని ఆకట్టుకొంటున్నాయ్.

మొదటి ఫోటోలో సచిన్, సెహ్వాగ్, గంగూలీ ముగ్గురు బ్యాట్ పట్టుకొని ఉండటం ఏంటీ ? అనే డౌటు రావడం సహజం. ఐతే, బై రన్నర్ ఒకరు వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఈ ముగ్గురిలో బై రన్నర్ ఎవరన్నది సెహ్వాగ్ నే చెప్పాలి. ఇక, వ్యాఖ్యతగా ఈ త్రీ స్టార్స్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. మొత్తంగా.. మాజీలు తాజా వరల్డ్ కప్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా.. !!