బాలయ్య చంద్రబాబుని మించినోడు : వర్మ
నందమూరి బాలకృష్ణపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. బాలయ్య చంద్రబాబుని మించునోడు. బాలయ్య చేస్తున్నది.. చంద్రబాబు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచిన దానికంటే పెద్దదని అన్నారు. ట్విట్టర్ వేదికగా జూ. ఎన్టీఆర్ కు వర్మ ఓ సలహా ఇచ్చారు. ఇందులో బాలయ్య వెన్నుపోటు విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇంతకీ వర్మ ఏమన్నారంటే.. ? “ఎన్టీఆర్ అభిమానిగా తారక్ కి ఓ సలహా. మీ బాబాయ్ బాలయ్య మాదిరిగా.. మీ తాతకు వెన్నుపోటుదారునిగా నిలవద్దు. మీ బాబాయ్ చేస్తున్నది.. చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన దానికంటే పెద్దది” అంటూ ట్విట్ చేశారు.
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. నేపథ్యంలో జూ. ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. ఆయన టీడీపీకి అసలైన వారసుడు. తాతపెట్టిన పార్టీని తారక్ తన చేతుల్లోకి తీసుకొనే టైం వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దమ్ము, ధైర్ఘ్యం తారక్ కే ఉన్నాయని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్మ చేసిన సంచలన ట్విట్ చర్చనీయాంశంగా మారింది.
I request u @tarak9999 just as an NTR fan, not to join the backstabber of ur grandfather, like the way ur babai did ..What ur babai did is a bigger vennupotu than what the alludu did😡
— Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2019