పాక్ చిత్తు చిత్తుగా.. !

ప్రపంచకప్ లో మరో మ్యాచ్ చప్పగా ముగిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాక్ పై వెంస్టిండీస్ సునాయస విజయం సాధించింది. తొలి బ్యాటింగ్ చేసిన పాక్ 106 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ను ఒషాన్‌ థామస్‌ (4/27), జాసన్ హోల్డర్‌ (3/42), ఆండ్రీ రసెల్‌ (4/2) భారీ దెబ్బకొట్టారు. పాక్ బ్యాట్స్ మెన్స్ లో ఫకర్‌ జమాన్‌ (22; 16 బంతుల్లో 2×4, 1×6), బాబర్‌ ఆజామ్‌ (22; 33 బంతుల్లో 2×4) టాప్‌ స్కోరర్లు.

పాక్‌ నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. ఛేదనలో క్రిస్‌గేల్‌ (50; 34 బంతుల్లో 6×4 3×6) అద్భుత అర్ధశతకంతో చెలరేగాడు. అతడికి తోడుగా నికోలస్‌ పూరన్‌ (34*; 19 బంతుల్లో 4×4, 2×6) కళ్లు చెదిరే బౌండరీలతో అలరించాడు.