‘ఓ బేబీ’ టైటిల్ సాంగ్ విన్నారా.. ?

సమంత తాజా చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకురాలు నాగశౌర్య, రావు రమేశ్‌, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

ఇదో ప్రయోగాత్మక సినిమా. కొరియన్‌ కామెడీ చిత్రం ‘మిస్‌ గ్రానీ’కు ఇది రీమేక్‌గా రాబోతోంది. ఇందులో సామ్ యంగ్, మిడిల్ యేజ్, ముసలి పాత్రలో కనిపించబోతుంది. తాజాగా, ఈ సినిమా టైటిల్ సాంగ్ వచ్చేసింది. ‘ఓ బేబీ.. ఓ బేబీ..’ అంటూ సాగుతున్న ఈ పాట ఎంతో ఫన్నీగా ఉంది. పాటలో సమంత అల్లరి చేష్టలు నవ్వులు పూయించాయి.