మహేష్ రాకుంటే.. సినిమా హిట్టే !


సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరుకాడు. అందుబాటులో ఉన్న అటువైపు చూడడు. ఎందుకంటే ? సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ వస్తే.. ఆ సినిమా ప్లాపు అవుతుందట. ఆ సెంటిమెంట్ తోనే మహేష్ తన సినిమా ఓపెనింగ్స్ కి దూరంగా ఉంటాడట. గత ఆరేడు సినిమాల ఓపెనింగ్స్ కి మహేష్ రాలేదు. శుక్రవారం ప్రారంభమైన మహేష్26 చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ డుమ్మా కొట్టారు. దీన్ని అభిమానులు కూడా సీరియస్ గా తీసుకోలేదు.

వారికి కావాల్సింది. సినిమా హిట్ కావడం… వాళ్లని కాలరెగిరేయడంలా చేయడం. మహర్షి సినిమాతో అభిమానులతో పాటు మహేష్ కూడా కాలరెగిరేశాడు. ఒకటికాదు.. రెండుసార్లు ఎగిరేశాడు. మహర్షి26 ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఇక, మహేష్ కు టైటిల్స్ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన తన సినిమాలకి మూడక్షరాల టైటిల్స్ ఉండేలా చూసుకొంటారు. భరత్ అను నేను సినిమాకు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలోనూ మహేష్ సెంటిమెంట్ బ్రేక్ అయింది. 2020 సంక్రాంత్రికి సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.