మూడేళ్ల ఏపీ నందులు.. ఇవే !

ఏపీ నందులు వచ్చేశాయ్. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులని ప్రకటించింది. వీటితో నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించింది. దీంతో.. ఇండస్ట్రీ కళకళాడుతోంది. 2014 – లెజెండ్, 2015 – బాహుబలి (బిగినింగ్), 2016 – పెళ్లి చూపులు సినిమాలు నంది అవార్డులు కైవసం చేసుకొన్నాయి.

నంది అవార్డులు పూర్తి వివరాలు :

2014 ఉత్తమ చిత్రం లెజెండ్‌
2014 ఉత్తమ నటుడు (బాలకృష్ణ(లెజెండ్‌)
2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం
2014 ఉత్తమ విలన్ జగపతిబాబు(లెజెండ్‌)
2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య(మనం)
2014 ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం
2014 ఉత్తమ నటి- అంజలి(గీతాంజలి)
2014 ఉత్తమ ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్‌(అలా ఎలా)
2014 ఉత్తమ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌
2014 ఉత్తమ ఫైట్‌మాస్టర్‌ రామ్‌ లక్ష్మణ్‌(లెజెండ్‌)
2014 ఉత్తమ బాలనటుడు గౌతమ్‌కృష్ణ (నేనొక్కడినే)
2014 ఉత్తమ రచయిత- ఎం.రత్నం
2014 ఉత్తమ సహాయ నటి- మంచు లక్ష్మి(చందమామ కథలు)
2014 ఉత్తమ హాస్యనటుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం)

2015 ఉత్తమ చిత్రం బాహుబలి(బిగినింగ్‌)
2015 ఉత్తమ నటుడు మహేష్‌బాబు(శ్రీమంతుడు)
2015 ఉత్తమ కుటుంబ కథాచిత్రం- మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు
2015 బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- కంచె
2015 ఉత్తమ బాలల చిత్రం -దానవీర శూరకర్ణ
2015 ఉత్తమ నటి అనుష్క(సైజ్‌ జీరో)
2015 ఉత్తమ దర్శకుడు (రాజమౌళి( బాహుబలి)
2015 ఉత్తమ హాస్యనటుడు- వెన్నెల కిశోర్‌ (భలే భలే మగాడివోయ్‌)
2015 ద్వితీయ ఉత్తమ చిత్రం- ఎవడే సుబ్రమణ్యం
2015 తృతీయ ఉత్తమ చిత్రం- నేను శైలజ
2015 ఉత్తమ మాటల రచయిత- సాయిమాధవ్‌( మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు)
2015 ఉత్తమ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి

2016 ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు
2016 ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌
2016 ద్వితీయ ఉత్తమ చిత్రం- అర్ధనారి
2016 తృతీయ ఉత్తమ చిత్రం- మనలో ఒకడు

2014 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు – క‌మ‌ల్ హాసన్‌
2014 నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- ఆర్‌.నారాయణమూర్తి
2014 రఘుపతి వెంకయ్య అవార్డు- కృష్ణంరాజు
2014 స్పెషల్‌ జ్యూరీ అవార్డు- సుద్దాల అశోక్‌తేజ

2016 రఘుపతి వెంకయ్య అవార్డు – చిరంజీవి
2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు
2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు- రజనీకాంత్‌
2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్‌