నిర్మల ఎఫెక్ట్ : ట్విట్టర్ నుంచి తప్పుకొన్న రమ్య
కాంగ్రెస్ మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య ట్విట్టర్ నుంచి వైదొలిగారు. ఆమె కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ నాయకురాలిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె చేసిన పలు ట్విట్లు వివాదాస్పదం అయ్యాయి. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ పై రమ్య చేసిన ట్విట్ నెటిజన్స్ కి ఆగ్రహం తెప్పించింది. దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పలువు హర్షం వ్యక్తం చేశారు. నిర్మలని అభినందించారు కూడా.
రమ్య కూడా నిర్మలని అభినందిస్తూ ట్విట్ చేసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తొలి ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారనే కటింగ్ ఇచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు.. ఆర్థికశాఖని తన దగ్గరే ఉంచుకొన్నారు. ఇప్పుడు మాత్రం నిర్మలపై నమ్మకంతో ఆమెకు పూర్తిస్థాయిలో ఆర్థికశాఖను అప్పగించారు. ఐతే, నిర్మలని తొలి మహిళా ఆర్థికశాఖ మంత్రి అనడం ఇష్టంలేని రమ్యని నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆ దెబ్బకు రమ్య తన ట్విట్టర్ ఖాను నుంచి వైదొలిగారు.