మహేష్ గీత కథ.. ఇదేనా ?

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసేందుకు గీతా ఆర్ట్స్ రెడీ అవుతోంది. చాలామంది దర్శకులని అనుకొన్నా.. పరశురామ్ ఫైనల్ అయ్యాడు. ఇటీవల పరశురామ్ మహేష్ ని కలిసి ఓ లైన్ వినిపించాడు. అది మహేష్ కు కూడా బాగా నచ్చేసింది. దీంతో పూర్తి స్క్రిప్టుని రెడీ చేయమని చెప్పాడట. ప్రస్తుతం పరశురామ్ స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంతకీ మహేష్ కోసం పరశురామ్ ఎంచుకొన్న నేపథ్యంలో ఏంటో తెలుసా ? పక్కా పల్లెటూరు నేపథ్యంలో సినిమా ఉంటుందట. ఇక ఫ్లాష్ బ్యాక్ లో సినిమా 1980లోకి వెళ్తుందట. ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఎమోషనల్ గా సాగుతాయని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ ని కథకి కనెక్ట్ చేసే విధానం మహేష్ కి బాగా నచ్చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ తో గీతా ఆర్ట్స్ సినిమా ఉండనుంది.