ఉపాసన.. ఆడ సింహం !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడసింహాం భార్య ఉపాసన అనిపించుకొంది. ప్రస్తుతం ఉపాసన భర్త రామ్ చరణ్ తో కలిసి ఆఫ్రికా దేశంలో విహరిస్తున్నారు. టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్ లో విహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన సింహాలతో ఆడుకుంటున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఇప్పుడు మీకు అర్థమైంది ఉంటుంది. చరణ్ నన్నెందుకు పెళ్లి చేసుకొన్నాడో’ అనే కామెంట్ పెట్టింది. ఫోటోలు ఉపాసన వెల్లికిలా పడుకొన్న రెండు సింహాల కడుపై రెండు చేతులు ఉంచింది.
ఇక, సినిమాల విషయాకొస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’లో నటిస్తున్నారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. మరో కథానాయకుడుగా తారక్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది జులై30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.