నాని సినిమా.. నిజం కాదు బాయ్స్‌ !


నేచురల్‌ స్టార్‌ నాని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో కమిట్ అయ్యాడు. వీరి కలయికలో రాబోతున్న చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించబోతుందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారనే వార్తలొచ్చాయ్. కాగా ఇదే వార్తను నాని అభిమానులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. నాని తర్వాతి సినిమా ఇదేనని వివరాల్ని షేర్‌ చేశారు.

దీన్ని చూసిన నాని స్పందించారు. ‘అది నిజం కాదు మై బాయ్స్‌’ అని ట్వీట్‌ చేశారు. దీంతో నానితో అడ్డాల సినిమా ఉత్తిత్తి ప్రచారమేనని తేలిపోయింది. ప్రస్తుతం నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క ‘వి’ అనే సినిమాలోనూ నాని కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇందులో సుధీర్‌బాబు మరో కథానాయకుడు. నివేదా థామస్‌, అదితి రావు హైదరి కథానాయికలు. అదితి నానికి జంటగా, నివేదా సుధీర్ బాబుకు జంటగా నటిస్తున్నారు. ఇందులో రోల్ చాలా చిన్నదే అయినా.. కథలో కీలకంగా ఉండనుందని చెబుతున్నారు.