సింహాలతో.. ఉపాసన ఆటలు చూశారా ?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మాములు మహిళా కాదు. ఆమె ధైర్ఘ్యం ఎక్కువే. ఏకంగా సింహాలతో ఆటలాడుకుంటోంది. ప్రస్తుతం ఉపాసన భర్త రామ్ చరణ్ తో టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్ లో విహరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఉపాసన సింహాలతో ఆడుకుంటున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఇప్పుడు మీకు అర్థమైంది ఉంటుంది. చరణ్ నన్నెందుకు పెళ్లి చేసుకొన్నాడో’ అనే కామెంట్ పెట్టింది. అది నిజమే. చరణ్ బయపెట్టే పెళ్లాడి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’లో నటిస్తున్నారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు.వచ్చే యేడాది జులై30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.