దాసు బూతు వార్నింగ్

‘ఫలక్‌నుమాదాస్‌’ టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకొన్నాడు. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 తరహా సంచలన విజయాన్ని నమోదు చేసేలా కనిపించాడు. సినిమా విజయంపై దర్శకుడు, హీరో విశ్వస్ సేన్ ధీమా వ్యక్తం చేశారు. తోపు సినిమా తీశానని సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కాస్త ఓవర్ గానే మాట్లాడారు. సినిమా కంటెంట్ పై ఆయనకున్న నమ్మకం అలాంటిది అనుకొన్నారు. తీరా సినిమా విడుదలయ్యాక విశ్వక్ సేన్ ఓవర్ చేశాడని అర్థమైంది. సినిమా బాగులేదంటూ నెగటివ్ కామెంట్స్ వినిపించాయ్.

రిలీజ్ ముందు విశ్వస్ సేన్ చేసిన అతిపై ట్రోలింగ్ జరిగింది. దీనిపై విశ్వస్ సేన్ తనదైన శైలిలో స్పందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బూత్ వార్నింగ్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ప్రస్తుతం విజయవాడలో ఉన్నా. హైదరాబాద్‌ వస్తున్నా. విజయవాడలో ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ బాగుంది అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహిస్తా. నేను చాలా మందికి ఆన్సర్ చెప్పాలి. ఒక్కొక్కడ్ని దెం*** షేప్ అవుట్ అవుతాడు. పిచ్చి లం*** కొడుకులు’ అంటూ బూతులతో రెచ్చిపోయాడు. సక్సెస్ మీట్ లో విశ్వక్ సేన్ ఎవరినీ, ఏ రేంజ్లో.. దెం**తాడు అనేది చూడాలి.