హిప్పీ మరో ఆర్ఎక్స్100 కాదట


‘ఆర్‌.ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రం హిప్పీ. దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్‌ కథానాయికలు. టి.ఎన్‌.కృష్ణ దర్శకుడు. కలైపులి ఎస్‌.థాను నిర్మాత. జూన్‌ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న కార్తీకేయ హిప్పీ ఒప్పుకోవడానికి గల కారణాలు తెలిపారు. ” ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తరువాత నేను చాలా కథలు విన్నాను. ఈ కథల్లో ‘ఆర్ ఎక్స్ 100’ కి పూర్తి భిన్నంగా హిప్పీ అని అనిపించింది. అందుకే ఈ సినిమాని ఒప్పుకొన్నా”
అన్నారు. ఐతే, హిప్పీ సినిమా టీజర్, ట్రైలర్ మాత్రం ఆర్ ఎక్స్ 100ని మించేలా ఉన్నాయి. కార్తీకేయ మాత్రం ఆ సినిమాతో పోలికే లేదంటున్నారు. హిప్పీ చూస్తే గానీ ఆ క్లారిటీ వచ్చేలా లేదు.