లైవ్ : సీఎం కేసీఆర్ కాళేశ్వరం సందర్శన
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులని పరిశీలిస్తున్నారు. ఈ ఉదయం సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు చేరుకోనున్నారు. అక్కడ నిర్మిస్తున్న మొదటి పంపుహౌస్ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు రెండు టీఎంసీలను ఎస్సారెస్పీ వరదకాల్వలో పోసిన తర్వాత ఒక టీఎంసీని మిడ్ మానేరుకు, మరో టీఎంసీని పునర్జీవ పథకం ద్వారా వరదకాల్వ నుంచి శ్రీరాంసాగర్నేడు సీఎం కాళేశ్వరం పర్యటనజలాశయంలోకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాంపూర్ పంపుహౌస్‌లో ఒక మోటరు సిద్ధంకాగా, రెండో మోటరు పనులు చివరిదశలో ఉన్నాయి. ఈ నెలాఖరుకు నాలుగింటిని సిద్ధంచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్ తొలుత ఈ పంపుహౌస్‌లో మోటర్ల బిగింపు పనుల పురోగతిని పరిశీలించారు. ఆ తర్వాత మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలిస్తున్నారు. అనంతరం అక్కడే సీఎం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కాళేశ్వరం పర్యటనని మీరు లైవ్ లో చూసేయండీ.. !
Hon'ble CM Sri KCR inspecting SRSP Reverse pumping works at Rampur pump house. #KaleshwaramProject https://t.co/igBnqDQPLP
— TRS Party (@trspartyonline) June 4, 2019