‘భారత్’ ట్విట్టర్ రివ్యూ


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భారత్’. కత్రినా కైఫ్ కథానాయిక. అలీ అబ్బాస్‌ దర్శకత్వం వహించారు. ఇందులో సల్మాన్ 18 ఏళ్ల యువకుడి నుండి 70 ఏళ్ల వృద్ధుడి వరకు డిఫరెంట్ గెటప్ లలో పోషించారు. టబు, దిషా పటానీ, సునీల్ గ్రోవర్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. రంజాన్ కానుకగా ‘భారత్’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇప్పటికే ‘భారత్’ బెనిఫిట్ షోస్ పడియాయి. సినిమా టాక్ ని నెటిజన్స్ ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉంది. దర్శకుడు అబ్బాస్ అలీ కథని వినోదాత్మకంగా, ఎమోషనల్ గా డీల్ చేశాడు. ఫస్టాఫ్ లో కామెడీ, రొమాన్స్, humour, విజువల్ ట్రీట్ అద్భుతంగా కుదిరాయి. ఇక సెకాంఢాఫ్ లో ఎమోషన్స్, డ్రామాని బాగా డీల్ చేశారు. 1970 ఏపీసోడ్ చాలా బాగుందని చెబుతున్నారు.

సల్మాన్ ఖాన్ ఎప్పటిలాగే అద్భుతమైన నటనని కనబర్చారు. నవ్విస్తాడు. ఏడిపిస్తాడు కూడా. ఆయన కెరీర్ లో బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చారని చెబుతున్నారు. కత్రినా కైఫ్ బ్రిలియంట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చింది. దిశా పటానీ నటనతో ఆకట్టుకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. భారత్ పైసా వసూల్ బ్లాక్ బస్టర్. ట్విట్టర్ రేటింగ్స్ కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయి. 4/5, 4.5/5 రేటింగ్స్ ఇస్తున్నారు.