వెంకీకి పెళ్లి చూపులు


విక్టరీ వెంకటేష్ కు పెళ్లి చూపులు జరగనున్నాయి. అలాగని ఈ వయసులో వెంకీ మరోసారి పెళ్లి చేసుకొంటున్నారని అనుకోవద్దు. పెళ్లి చూపులు, ఈ నగరానికేమైంది ? సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు తరుణ్ భాస్కర్. ఆయన మూడో సినిమా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఫిక్సయింది. వెంకీ హీరోగా ఆ సినిమా ఉండబోతున్నట్టు సమాచారమ్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటనరానుంది.

ప్రస్తుతం వెంకీ మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. చైతూకి జంటగా రాశీఖన్నా, వెంకీకి జంటగా పాయల్ రాజ్ పుత్ లు నటిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ సినిమా ఉండే అవకాశాలున్నాయి. ఇక, సురేష్ ప్రొడక్షన్స్ లో గుణశేఖర్-రానా దగ్గుపాటి హిరణ్యకశ్యప సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుంది.