టీ-పీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా !


తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద షాక్. పీసీసీ పదవి నుంచి తప్పుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారమ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ పదవి నుంచి తప్పుకోవాలని చూస్తున్నారట. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లోనూ తెలంగాణ కాంగ్రెస్ కు మరిన్ని గట్టు పరిస్థితులు ఎదురుకానున్నాయి. సీఎల్పీని తెరాసలో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ పని పూర్తి చేయనుంది తెరాస.

నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఈ నెల 6న అసెంబ్లీ స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 18కి పడిపోనుంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ ని
తెరాసలో విలీనం చేయడం మరింత ఈజీ కానుంది. ఇదీగాక, తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఈ పరిణామల నేపథ్యంలో టీ-పీసీసీ పదవి నుంచి తప్పుకోవడమే బెటరని ఉత్తమ్ భావిస్తున్నారంట.

ఇక, ఉత్తమ్ స్థానంలో పీసీసీ చీఫ్ పదవిని చేపట్టేందుకు కోమట్ రెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మరీ.. అధిష్టానం ఉత్తమ్ కి సర్థిజెప్పి ఆయన్నే టీపీసీసీ చీఫ్ గా కొనసాగిస్తారా.. ? లేదంటే ఉత్తమ్ రాజీనామాని ఆమోదించి కొత్త పీసీసీ చీఫ్ ని నియమిస్తారా.. ? అన్నది చూడాలి.