‘ఆర్.ఆర్.ఆర్’ ఓవర్సీస్ డిమాండ్ ఎంతో తెలుసా ?


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి తీసుకొస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రీ-రిలీజ్ బిజినెస్ కు డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం దుబాయ్ సంస్థ రూ. 66కోట్ల వరకు ఆఫర్ తో వచ్చినట్లు తెలుస్తోంది. ఐతే, నిర్మాత డివివి దానయ్య ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నారు. రూ. 70కోట్లు కావాలంటున్నాడు. ఇంకా ఫైనల్ డీల్ జరగలేదు.

అల్లూరి సీతారామారాజు, కొమరం భీమ్ ల కథతో ‘ఆర్.ఆర్.ఆర్’ తెరకెక్కుతోంది. అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. కొమరం భీమ్ గా తారక్ నటిస్తున్నారు. ఆయనకి జంటగా హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. వచ్చే యేడాది జులై30 రిలీజ్ కానుంది.