అఫీషియల్ : వెంకీతో ‘దే దే ప్యార్‌ దే’ రిమేక్

అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’. ఈ చిత్రానికి అకీవ్‌ అలీ దర్శకత్వం వహించారు. వయసుతో సంబంధం లేకుండా ఓ మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రకుల్ 26 ఏళ్ల రకుల్‌ 50 ఏళ్ల అజయ్‌ ప్రేయసిగా నటించారు. ఆయన మాజీ భార్య పాత్రను టబు పోషించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది.

ఈ సినిమా తెలుగు రిమేక్ లో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొన్నారు. ఇప్పుడీ ప్రచారం నిజమైంది. దే దే ప్యార్ దే తెలుగు రిమేక్ ని అధికారికంగా ప్రకటించారు సురేష్ బాబు. గురువారం రామానాయుడు జయంతి. ఆయన స్థాపించిన సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఇటీవల 55 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు.

సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కనున్న చిత్రాల గురించి తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలై మంచి విజయం అందుకున్న ‘దే దే ప్యార్‌ దే’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నాం. ఇందులో వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తారు. మిగిలిన విషయాలు త్వరలో ప్రకటిస్తామని సురేష్ బాబు తెలిపారు.