రోహిత్ సెంచరీ.. !


228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ 100 (128బంతుల్లో 10*4, 2*6)
అదరగొట్టాడు. పరుగులు రావడం కష్టంగా మారిన పిచ్ పై రోహిత్ తన శైలికి భిన్నంగా ఆడుతున్నారు. క్లాస్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకొన్నాడు.

శిఖర్ ధావన్ 8 పరుగులకే పెలివియన్ కు చేరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 18 పరుగులకే అవుటయ్యాడు. దీంతో రోహిత్ బాధ్యతని తీసుకొని ఆడాడు. నెం.4లో వచ్చిన కెయల్ రాహుల్ 26 పరుగులు చేశాడు. ప్రస్తుతం రోహిత్ సెంచరీ పూర్తి చేసి జోరుమీదున్నాడు. ఆయనకి తోడుగా ధోని 17 పరుగులతో క్రీజు లో ఉన్నారు. గెలుపుకోసం టీమిండియాకు 56 పరుగులు కావాలి. 59 బంతులు ఉన్నాయి.

అంతకుముందు యుజువేంద్ర చాహల్‌ (4/51), జస్ప్రీత్‌ బుమ్రా (2/35), భువనేశ్వర్‌ (2/44) భారీ దెబ్బకొట్టి సఫారీలను 227/9కే పరిమితం చేశారు. డుసెన్‌ (22; 37 బంతుల్లో 1×4), డేవిడ్‌ మిల్లర్‌ (31; 40 బంతుల్లో 1×4), ఫెలుక్‌వాయో (34; 61 బంతుల్లో 2×4, 1×6), రబాడ (31*; 35 బంతుల్లో 2×4) రాణించారు.