ప్రపంచకప్ : టీమిండియా ఈజీ విన్
ప్రపంచకప్ లో టీమిండియా తొలి గెలుపుని నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన ఆరు వికెట్లతో తేడా విజయం సాధించింది. 228 పరుగుల లక్ష్యాన్ని47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 122 (144బంతుల్లో 13*4, 2*6) నాటౌట్ జట్టుకి విజయాన్ని అందించాడు. ఇక, ఆడిన మూడు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది.
అంతకుముందు యుజువేంద్ర చాహల్ (4/51), జస్ప్రీత్ బుమ్రా (2/35), భువనేశ్వర్ (2/44) భారీ దెబ్బకొట్టి సఫారీలను 227/9కే పరిమితం చేశారు. డుసెన్ (22; 37 బంతుల్లో 1×4), డేవిడ్ మిల్లర్ (31; 40 బంతుల్లో 1×4), ఫెలుక్‌వాయో (34; 61 బంతుల్లో 2×4, 1×6), రబాడ (31*; 35 బంతుల్లో 2×4) రాణించారు.
A wonderful, mature innings from Rohit Sharma. Great assessment of the situation and seeing India through to the win in the end, a hallmark of top players @ImRo45 . A well begun World Cup campaign for Team India #INDvSA pic.twitter.com/Hmul57c4BO
— VVS Laxman (@VVSLaxman281) June 5, 2019